Tuesday, July 15, 2014

  


   ఇప్పుడు  పసి పిల్లలకి పుట్టగానే  ఐటెక్స్, లేక రంగు రంగుల  బొట్టు బిళ్ళలు పెట్టటం అలవాటైనది. ఖాని పూర్వం సాధు అని పెట్టే వారు.అది నల్లగా ఉండి  మెరుస్తుంది. మొగపిల్లలకు ఆడ పిల్లలకి కూడా నుదుటి నే కాక దిష్టి  తగలకుండా బుగ్గన,చుబుకం మీదా పెట్టేవారు. డానిని  ఎలా చేస్తారంటే----ఒక గిన్నెలో గుప్పెడు సగ్గుబియ్యం తీసుకొని పొయ్య మీద పెట్టి  బాగా నల్లగా అయ్యే వరకు మాడ్చితే జిగురు వస్తుంది. గట్టిపడేటప్పుడు  ఒక చిన్న గ్లాసుతో నీళ్ళు రెడీగా పెట్టుకొని పొయ్యలి. స్టౌ కట్టేసి  దానిని నీడలో ఆరనివ్వాలి. అంతే నిగనిగ  లాడే సాధు  పిల్లలకు పెట్టటానికి సిధం. చిన్నప్పుడు నుంచి కృత్రిమమైనవి వాడ కుండా ఇలాంటివి చేసుకోవచ్చు.కొందరు బియ్యపు నూకతో కూడా చేస్తారు కాని సగ్గుబియ్యం ఐతేనే  మెరుస్తూ ఉంటుంది. 

No comments:

Post a Comment