Saturday, July 12, 2014

Chaatuvu

టెలుగు లో పద్య సాహిత్యానికి  ఎంత ప్రాశస్త్యం ఉన్నదో అలాగే చాటు పద్యానికి కూడా  అంత ప్రాధాన్యత ఉన్నది.అలాంటి ఒక చాటు పద్యానికి చూధాము .దీనికి అభినయం జోడిస్తే కాని  అసలు భావం తెలియదు.
   రాజిత  కీర్తి శాలి అగు రాయని  భాస్కరు వేడబోయినన్
   ఆజికి ఇట్లనున్, పరుని ఆలికి ఇట్లను,అర్థికిట్లనున్,
   తేజము పెంపు లేని కడు దీనుని హీనుని వేడబోయినన్
   ఆజికి ఇట్లనున్, పరుని ఆలికి ఇట్లను,అర్థికిట్లనున్.
     ఇందులో రెండు, నాలుగు  పాదములు ఒకలాగానే ఉన్నాయి .ఇందులో గొప్పతనమేమున్నది అనుకోవచ్చు. దీనికి అభినయం జోడిస్తే వ్చ్చే అర్ధం వేరు.రెండొ పాదం చదివే టప్పుడు  ఆజి అన్నప్పుడు విల్లు ర్క్ కు పెట్టినట్లుగా,పరుని ఆలి అన్నప్పుడు నమస్కారంతోను,అర్ధికి అన్నప్పుడు దానం చేస్తాడని అభినయించి, నాలుగవ పాదం చెప్పేటప్పుడు  యుధ్ధం లో పలాయనం చిత్తగిస్తాడని,పరుని ఆలికి కన్ను కొడతాదని ,అర్ధికి మొండిచెయ్యి చూపిస్తాడని చదివితే ఇందులోని వ్యగ్యం అవగత మౌతుంది.

No comments:

Post a Comment