Tuesday, September 9, 2014

ChaaTuvu.

చాటువు
         వేముల వాడ భీమకవి మహిమానిత్వాన్ని గూర్చి చెప్పబడిన ఈ చాటువు ఎవరి కృత మైనప్పటికీ విశిష్టమైనది గా చెప్పవచ్చు.
   చం. మతి,ప్రభ,నీగి,పేర్మి,శిరి,మానము పెంపున భీమునిన్ బృహ
              స్పతి,రవి,కర్ణు,అర్జును,కపర్ధి,సుయోధను బోల్ప బూన;నా
              మతకరి,తైష్ణు,దుష్కులు,నమానుషు,భిక్షు,ఖలాత్ము నెంచ;వా
             క్సతిపు,శశిన్,శిబిన్,కొమరు సామిని,మేరువు,నబ్ది బోల్చెదన్.
                              బుధ్ధి విషయం లో భీమకవి బృహస్పతితో కాక వాక్సతి భర్త బ్రహ్మ తో పోల్చ దగినవాడట.బృహస్పతి మతకరి కనుక.తేజస్సు లో రవి తీక్షణుడు కనుక చంద్రుని తో పోల్చదగిన వాడు.దాత్రుత్వం లో కర్ణుడు దుష్కలుడు కనుక శిబి తోను,పౌరషం లో అర్జునుడు పేడి వాడు కనుక కుమారస్వామి తోను,ఐశ్వర్యం లో శివుడు భిక్షువు కనుక  మేరువు తోను,అభిమానం లో సుయోధనుడు ఖలాత్ముడు కనుక  సముద్రం తోను పోల్చాడు. క్రమాలంకారం లో ఎంతో చక్కగా చెప్పబడిన  చాటువు.

No comments:

Post a Comment