Friday, August 7, 2015

మినీకవితలు



   పాపాయి
   బోసి నవ్వులు
   ఇల్లంతా
   వెన్నెల వెలుగులు

   పల్లె
   పలచ బడింది
   పట్నం
   చిక్క బడింది.
  
   వాడు
   పశువయ్యాడు
   ఆమె
   గ్రాసమయ్యింది.

   మౌనం
   మాట్లాడుతుంటే
   శబ్దం
   మూగబోతుంది.

   అక్షరం
   అణ్వాయుధమైతే
   జ్ఞానం 
   అనంత మౌతుంది.

  కన్నీళ్ళు 
  భగవంతునికి అర్జీలు
  పరిశీలిస్తాడో?
  బుట్టదాఖలు చేస్తాడో?
   

2 comments:

  1. మీ బుల్లి కవితలు భలే బాగున్నాయి.

    ReplyDelete
  2. కన్నీళ్ళు
    భగవంతునికి అర్జీలు..బాగుంది

    ReplyDelete